విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో గురువారంనుంచి హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌లో జవాబుపత్రా ల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) నిర్వహించనున్నారు.
Tenth spot valuation
ఈ మేరకు క్యాంప్ ఆఫీసర్ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, ఏసీజీ చలపతిరావు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీఫ్ ఎగ్జామినర్లు (సీఈ), అసిస్టెంట్ ఎగ్జామినర్లు(ఏఈ)గా 950మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరు ఆరు సబ్జెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారు. మరో 350 మంది ఉపాధ్యాయులు స్పెషల్ అసిస్టెంట్లుగా భాగస్వాములు కానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపరిధి హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోని ఆయా సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లను సీనియారిటీని బట్టి నియమించారు. వీరికి ఆర్డర్లు కూడా ఇచ్చారు. స్పాట్‌క్యాంపునకు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలనుంచి సబ్జెక్టులు కలిపి 2.80లక్షల జవాబుపత్రాలు వచ్చాయి.