Skip to main content

నైట్ క్వీన్ పువ్వులు రాత్రివేళే ఎందుకు వికసిస్తాయి?

Tenth Classకొన్ని జంతువులు, కీటకాలు, ఇతర ప్రాణులు పగటిపూట విశ్రాంతి తీసుకుని, రాత్రిపూట సంచరిస్తుంటాయి. అలాగే కొన్ని మొక్కలు రాత్రివేళ మాత్రమే పూలు పూస్తాయి. ఇటువంటి వాటిలో నైట్ క్వీన్ ఒకటి రాత్రిపూట పూలు పూసే మొక్కలు ‘‘హనీసకెల్’’ నైట్ షేడ్ కుటుంబానికి చెందినవి.

పగటివేళ ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతను, కాంతిని భరించలేకపోవడం వల్లనే నైట్‌క్వీన్ మొక్క పగలుగాక రాత్రుళ్లు పువ్వులు పూస్తుంది.

రాత్రివేళ పూసే ఈ పూలు మధురమైన సువాసనను కలిగి ఉంటాయి. ఈ సువాసనకు తుమ్మెదలు చెట్టు దగ్గరికి చేరతాయి. ఇవి పువ్వుల మీద వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పుప్పొడి అంటుకుంటుంది. ఇవి ఎగిరి ఇదే జాతికి చెందిన మరొక పువ్వు మీద వాలినపుడు పుప్పొడి వాటి మీద రాలుతుంది. దీన్ని పరాగసంపర్కం అంటారు.

నైట్‌క్వీన్ పూలు పరాగసంపర్కం కోసమే రాత్రివేళ వికసిస్తాయి. ఈ పూలకు ఆకర్షణీయమైన రంగులు వుండవు. తెల్లగా ఉంటాయి. కాబట్టి రంగులు లేని ఈ పూలు రాత్రివేళల్లో కూడా కీటకాలను ఆకర్షించగలుగుతాయి.
Published date : 13 Nov 2013 10:22AM

Photo Stories