Skip to main content

చెట్ల ఆకులు ఎందుకు వేడెక్కవు?

Tenth Classతీవ్రమైన ఎండలో ఏ వస్తువును వుంచినా అది కొంచెంసేపటికి వేడెక్కుతుంది. మనం ఎండలో నిలబడితే మన శరీరం కూడా వేడెక్కుతుంది. అయితే ఎంత తీవ్రమైన ఎండలో వున్నా చెట్ల ఆకులు మాత్రం వేడెక్కకుండా చల్లగానే వుంటాయి.

‘బాష్పోత్సేకం’ అనే ప్రక్రియ వల్ల ఆకులు ఇలా వేడె క్కకుండా చల్లగా వుండగలుగుతున్నాయి. చెట్లఆకులు కణాల యొక్క అనేక పొరలతో ఏర్పడి వుంటాయి. ఆకుల పైభాగాన్ని అప్పర్ ఎపిడెర్మిస్, దిగువభాగాన్ని లోయర్ ఎపిడెర్మిస్ పొరలు కప్పి వుంచుతాయి. లోయర్ ఎపిడెర్మిస్ పొరలో అనేక రంధ్రాలు వుంటాయి. వీటిని ‘స్టోమేట్’ అంటారు. ఈ రంధ్రాలు కవాటాలలా పని చేస్తాయి. ఇవి తెరచి వున్నప్పుడు కార్బన్‌డయాక్సైడ్‌ను ఆకులోనికి పోనిస్తాయి. ప్రాణవాయువును, నీటికణాలను బయటకు వదులుతాయి. ఈ రంధ్రాలు మూసుకుని వున్నప్పుడు గాలి బయటకు వెళ్లడం గానీ, లోపలికి రావడంగానీ జరగదు. సాధారణంగా ఈ రంధ్రాలు పగటివేళ తెరుచుకుని, రాత్రివేళ మూసుకుని వుంటాయి. ఈ రంధ్రాల ద్వారా బయటకు పోయే నీటిని వేళ్ల ద్వారా మళ్లీ పీల్చుకుంటాయి. ఈ ప్రక్రియను ‘బాష్పోత్సేకం’ అంటారు. ఈ బాష్పోత్సేకం వల్లనే ఎండలో కూడా మొక్కల ఆకులు చల్లగా వుండగలుగుతున్నాయి.
Published date : 13 Nov 2013 11:05AM

Photo Stories