Skip to main content

మొక్కలు వెలుతురు వైపు ఎందుకు వంగుతాయి?

Tenth Classమొక్కలు వెలుతు రు ఉండే వైపు వంగుతుండడాన్ని మనం గమనించవచ్చు. ఇలా వెలుతురు వైపు వంగ డాన్ని ‘‘ఫొటోట్రాపిజం’’ అంటారు.
మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కల ఆకులలో ‘క్లోరోఫిల్’ అనే ఆకుపచ్చని పదార్థం ఉంటుంది. ఇది సూర్యరశ్మిలో కిరణజన్యసంయోగక్రియ ద్వారా నీటిని, కార్బన్‌డై ఆక్సైడ్‌ను కలిపి ఆక్సిజన్‌ను గాలిలోకి వదిలి, చక్కెరను ఆహారంగా తీసుకుంటుంది. కిరణజన్యసంయోగ క్రియ జరగడం కోసమే ఆకులు సూర్యరశ్మి వైపు వంగుతాయి. సూర్యకాంతి లేకపోతే మొక్కలు ఎక్కువ కాలం జీవించలేవు.
మొక్కలలో జీవకణాలు పెరగడానికి వాటిలో ‘అవురిన్స్’ అనే జీవపదార్థం ఉంటుంది. సూర్యకాంతి నుండి పక్కకు తొలగడం అవురిన్స్ లక్షణం. మొక్కలపై వెలుగుపడే వైపు కంటే వెలుగు పడని వైపు కణాలు త్వరగా పెరిగేలా చేస్తాయి ఇవి. దీనివల్ల కాండం, ఆకులు సూర్యరశ్మి వైపు వంగుతాయి.
Published date : 23 Dec 2013 04:54PM

Photo Stories