Skip to main content

మంట పైకి ఎందుకు వెళుతుంది?

Tenth Classఅగ్గిపుల్ల, కొవ్వొత్తి, కర్రపుల్ల దేన్ని వెలిగించినా మంట ఎప్పుడూ పైకి అంటే ఊర్థ్వముఖంగానే వెళుతుంది. ఎప్పుడూ కిందకు వుండదు.

ఇంధనాలన్నిటిలోనూ వాయువు లు వుంటాయి. కలప, బొగ్గు, అగ్గిపుల్ల, కొవ్వొత్తి ఇలా మండే లక్షణాలు వుండే వస్తువులన్నింటిలో కార్బన్, హైడ్రోజన్ వాయువులుంటాయి. ఈ వస్తువులు మండినప్పుడు కార్బన్, ఆక్సిజన్ కలిసి కార్బన్‌డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. మండుతున్నప్పుడు మరి కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి.

వాయువులు మండటం వల్లనే మంట ఏర్పడుతుంది. ఇంధనాలు మండుతున్నపుడు ఉత్పత్తి అయిన వాయువులు గాలి కంటే బరువుగా వుంటాయి. అందువల్ల మంట ఊర్ధ్వదిశగా అంటే పైకి వెళుతుంది.

నోటితో మంటపైకి గాలిని ఊదినపుడు అది మినుకుమినుకుమంటుంది. వాయువులు మండుతున్నప్పుడు అవరోధం కలిగితే మంటలకు కూడా అవరోధం కలుగుతుంది. ఏ అడ్డూ లేకపోతే మంట నిశ్చలంగా వుంటుంది.

కొవ్వొత్తి, కలప కాలినపుడు వచ్చే మంట లు ప్రకాశవంతంగా వుంటాయి. హైడ్రోజన్ వాయువుతో కలిసి మండినపుడు వచ్చే మంటలు కాంతిహీనంగా వుంటాయి.
Published date : 13 Nov 2013 10:57AM

Photo Stories