తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 2022–23 సంవత్సరానికి ఏడాదికి సం బంధించి మొదటి సంవత్సరం బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ప్రవేశాలకు టీజీయూజీసెట్–22 అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 23న నిర్వహించనున్నట్లు కన్వీనర్ రోనాల్డ్‌రాస్ డిసెంబర్ 8న ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి సొసై టీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 2021–22 సంవత్సరంలో ఇంటరీ్మడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.