Skip to main content

AP TET 2024: ‘టెట్‌’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే.. కేటాయింపు ఇలా..

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఫిబ్ర‌వ‌రి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
Amaravati Education Department Update   Department of School Education Notification   These are the centers chosen by the candidates for Tet exam   Teacher Eligibility Test 2024 Announcement

ఫిబ్ర‌వ‌రి 25న‌ ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్‌ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్‌ ఓ ప్రకటనలో ఖండించింది.

అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య  కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ పేర్కొన్నారు.   

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

కేటాయింపు ఇలా.. 

మ్యాథ్స్, సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొ­దటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవ­లం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406  మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373  మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్‌ వివరించారు. 

  • సోషల్‌ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు.  
  • తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. 
  • ఇంగ్లిష్‌ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు.  
  • హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నా­రు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు.
Published date : 26 Feb 2024 01:38PM

Photo Stories