Skip to main content

TET: ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత ఇలా..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసిన అభ్యర్థుల్లో సగం మంది కూడాఉత్తీర్ణత సాధించలేదు. సైన్స్, గణితం నేపథ్యం ఉన్న అభ్యర్థులే ఎక్కువ శాతం అర్హత సాధించారు.
TET
టెట్ ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత ఇలా..

జూన్ 12వ తేదీన జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి రెండు పేపర్లకు కలిపి 5,69,341 మంది హాజరయ్యారు. జూలై 1న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు https://tstet.cgg.gov.in వెబ్కు లాగిన అయి ఫలితాలు చూడవచ్చని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఈసారి టెట్ ఫలితాలు వెల్లడించారు. నెట్లో ఫలితాలు చూసుకోవాలని మాత్రమే అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో టెట్ ఫలితాలను ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించేవారు. టెట్ అర్హత పొందిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈసారి పేపర్–2 అభ్యర్థులకు కూడా పేపర్–1 రాసే అవకాశం కల్పించడం, టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉండేలా మార్పులు చేయడం వల్ల పోటీ బాగా పెరిగింది.

TS TET 2022 Results - Paper-1 | Paper-2

50 శాతంలోపే అర్హత

డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు 1–5 తరగతుల ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు. వీళ్లు టెట్లో పేపర్–1 రాస్తారు. ఇక బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చేసిన వారు 6–10 తరగతివరకు బోధించే టీచర్ పోస్టులకు అర్హత పొందుతారు. వీళ్లు పేపర్–2లో సైన్స్, మ్యాథ్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ (బీఎడ్లో చేసిన సబ్జెక్టును బట్టి) రాయాల్సి ఉంటుంది. అయితే, ఈసారి బీఎడ్ అభ్యర్థులకు పేపర్–1 రాసే వీలు కల్పించారు. 2019లోనే జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అప్పటినుంచి టెట్ నిర్వహించలేదు. రాష్ట్రంలో చివరి సారిగా 2017 జూలైలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత బీఈడీ, డీఎడ్ చేసిన వారు దాదాపు 80 వేల మంది ఉన్నారు. గత టెట్లో ఉత్తీర్ణులు కాని వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా ఇప్పుడు టెట్ పరీక్ష రాశారు. కాగా పేపర్–1, పేపర్–2లో అర్హత పొందిన వారు 50 శాతం లోపే ఉన్నారు. టెట్ అర్హత పొందిన వారంతా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. మొత్తం 13 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల అనంతరం కొత్త పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అర్హత పొందిన అభ్యర్థుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి.

2022 టెట్ ఫలితాలు సబ్జెక్టుల వారీగా..

పేపర్‌–1

పేపర్‌–2
మ్యాథ్స్, సైన్స్‌

పేపర్‌–2 సాంఘిక శాస్త్రం

పేపర్‌ 2లో

మొత్తం

దరఖాస్తుదారులు

3,51,476

1,49,315

1,28,578

2,77,893

హాజరైనవారు

3,18,444

1,34,037

1,16,860

2,50,897

ఉత్తీర్ణత శాతం

32.68

57.67

40.41

49.64

Published date : 02 Jul 2022 04:02PM

Photo Stories