‘TET’కు పకడ్బందీ ఏర్పాట్లు
సెప్టెంబర్ 1న తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆయన పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో జరిగే పేపర్–1 పరీక్షకు జిల్లాలో 15,263 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా 64 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేశామన్నారు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 11,573 హాజరు కానుండగా, 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్ పేపర్స్ | TS TET ప్రివియస్ పేపర్స్
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాలతోపాటు డిచ్‌పల్లి, ఎడపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినందున పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్‌ఎంకు సూచించారు. టెట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9030282993ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఈవో దుర్గాప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.