TS TET Question Papers Changed: అభ్యర్థులు ఆందోళన చెందొద్దు
ప్రశ్నాపత్రాలు మారిన మాట వాస్తమని, వాటిని సరిచేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఓఎంఆర్ షీట్‌లో వైట్‌నర్ ఉపయోగించేలా అనుమతినిచ్చామన్నారు. అభ్యర్థులు వైట్‌నర్ వాడడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలను ఆన్‌లైన్ ఉంచుతామని, అప్పుడు రాసిన జవాబులు వచ్చిన మార్కులను అభ్యర్థులు చూసేందుకు వీలుంటుందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే అన్ని విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
>> TS TET - 2023 Question Paper with key - Paper 1 | Paper 2 (Held on 15.09.2023)
అన్యాయం జరిగితే అధికారులే బాధ్యులు
టెట్ నిర్వహణలో తీసుకున్న తాత్కాళిక ఉపశమన మార్గాలతో ఎవరికీ అన్యాయం జరిగిన జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాధ్యులు అవుతారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. టెట్ అభ్యర్థులతో కలెక్టరేట్ చేరుకుని డీఈవో రమేశ్‌తో మాట్లాడారు.
అధికారులు తప్పిదాలు చేసిన విషయం వాస్తవం అనుకున్నప్పుడు అలాంటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు వెళ్లాలన్నారు. ప్రశ్నించిన విద్యార్థులను పరీక్ష హాల్ బయట పరీక్షలు రాయించిన అధికారి వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.