Skip to main content

Success of Vijai Subramaniam: రాయల్ ఓక్‌ను స్థాపించిన విజయ్‌ సుబ్రమణ్యం.. ఇదే ఆయన విజయానికి ప్రయాణం..!

ఏమీ లేని వాడి నుంచి అన్ని ఉన్నాయి అనే స్థాయికి ఎదిగారు విజయ్‌ సుబ్రమణ్యం.. పేదరికంలో ఉన్నప్పటికీ మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అని నిరూపించారు ఈయన. కొన్ని సంవత్సరాల కిందట మొదలైన ఇతని ‍ప్రయాణం చివరికి విజయవంతం అయ్యింది. ఇదే ఆయన ప్రయాణం..
Vijay's Remarkable Success Story  Vijai Subramaniam.. the founder of Royal Oak   Vijay's Inspirational Journey to Success

ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణ్యం' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Success as Civils Ranker: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగానూ.. సివిల్స్‌ ర్యాంకర్‌గానూ..! ఇలా సాధించుకున్నాడు

'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చేశారు. కుటుంబాన్ని పోషించే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు.

బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధువులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు.

Inspiring Mother and Son: తల్లి పడ్డ కష్టం బిడ్డ అందుకు గెలుపు.. ఇదే వారి ప్రయాణం..!

విజయ్ సుబ్రమణ్యం 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్‌ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు.

విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే 'రాయల్ ఓక్' ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి.

IAS Success Story : తొలి ప్రయత్నంలోనే.. ఐఏఎస్ ఉద్యోగం సాధించా.. నా విజయానికి స్ఫూర్తి వీరే..

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం.

Published date : 20 Dec 2023 12:29PM

Photo Stories