TOEFL: అర్హతతో కెనడాలోనూ చదవొచ్చు
కెనడా ప్రభుత్వ ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్)’పథకంలో భాగంగా ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఇకపై టోఫెల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా(ఐఆర్‌సీసీ) ఇందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించింది.
చదవండి: TOEFL: ఇకపై రెండు గంటల్లోనే ఈ పరీక్ష
ఇప్పటి వరకు ఎస్‌డీఎస్‌లో ఇంగ్లిష్ అర్హత పరీక్షగా ఐఈఎల్‌టీఎస్‌కు మాత్రమే ఆప్షన్ ఉండేది. ఈ ఏడాది ఆగస్ట్ 10వ తేదీ నుంచి ఎస్‌డీఎస్‌కు దరఖాస్తు చేసుకునేవారు టోఫెల్ స్కోరును కూడా జత చేసుకోవచ్చని వివరించింది. ఎస్‌డీఎస్ దరఖాస్తుల పరిశీలన దాదాపు 20 రోజుల్లోనే పూర్తవుతుందని ఈటీఎస్ పేర్కొంది. కాగా, టోఫెల్‌ను అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర 160కి పైగా దేశాలకు చెందిన 12 వేల సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
చదవండి: పిల్లలకూ ‘టోఫెల్’.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మరో వరం..