Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
కాకినాడలోని జేఎన్‌టీయూ(కే)లో ఉన్నత విద్యామండలి, ఆప్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఏపిల్ 17న స్టడీ అబ్రాయిడ్ ఫెయిర్–2023 నిర్వహించారు. ప్రొఫెసర్ నజీర్ అహా్మద్ మాట్లాడుతూ.. ఈ ఫెయిర్‌లో టాప్ 200 ర్యాంకింగ్ ఉన్న విదేశీ వర్సిటీలు పాల్గొనడం సంతోషమన్నారు. విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఏవిధంగా చెల్లిస్తారు తదితర వివరాలు తెలుసుకోవడానికి ఈ ఫెయిర్ ఉపయోగపడుతుందన్నారు.
చదవండి: VISA: దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
జేఎన్‌టీయూ(కే) వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాద రాజు మాట్లాడుతూ దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్న ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులు విదేశీ విద్య, అక్కడ వర్సిటీల విధానాలు తదితర వివరాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఫెయిర్‌లో 2,500 మంది విద్యార్థులు పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. వర్సిటీ రెక్టార్ కేవీ రమణ, రిజి్రస్టార్ సుమలత తదితరులు పాల్గొన్నారు.