Skip to main content

Working Holiday Maker Program: ఖాళీలు వెయ్యి.. దరఖాస్తులు 40 వేలు!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రకటించిన ‘వర్కింగ్‌ హాలిడే మేకర్‌ వీసా ప్రోగ్రాం’కు భారతీయ విద్యార్థులు పోటెత్తారు.
One thousand vacancies 40 thousand applications

కేవలం వెయ్యి వీసా ఖాళీలకు గాను రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్‌ సహాయ మంత్రి మ్యాట్‌ థిసిల్‌థ్వైట్‌ అక్టోబర్ 14న ఈ విషయం తెలిపారు. ఆస్ట్రేలియా సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చుకునేందుకు, వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవం సంపాదించుకునేందుకు ఇదో మంచి అవకాశమని మంత్రి మ్యాట్‌ చెప్పారు.

చదవండి: Canada Work Permit Rules Changed: వర్క్‌ పర్మిట్‌లో కీలక మార్పులు చేసిన కెనడా ప్రభుత్వం

‘ఈ వీసాకు 18–30 ఏళ్ల మధ్య భారతీయులు అర్హులు. ఎంపికైతే ఏడాదిపాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. అక్టోబర్‌ ఒకటిన మొదలైన దరఖాస్తు స్వీకరణ నెలాఖరుతో ముగుస్తుంది. అభ్యర్థులను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు వచ్చే ఏడాది జనవరి నుంచి ఆస్ట్రేలియాలో ఉండొచ్చు’అని తెలిపారు. 

Published date : 16 Oct 2024 09:30AM

Photo Stories