Study Abroad: విదేశి చదువులకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
విద్యార్థులు సయ్యద్ అయాన్‌అలీ, ఎండీ.అబ్దుల్ ఖయ్యుం బాలుర–3 టీఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అనంతరం వీరు ఉన్నత చదువుల కోసం టిమిరిస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటలీ దేశంలోని మిలాన్‌లోగల డెల్‌మార్చ్ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్స్ డిగ్రీ ఇన్ డిజిటల్ ఎకనామిక్స్ కామర్స్ కోర్సులో సీట్లు సంపాదించారు.
చదవండి: అమెరికాలో.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారా..? మీ సందేహాలకు.. సమాధానాలు.. ఎప్పుడంటే..?
విదేశీ ఉన్నత చదువులకు ఎంపికై న విద్యార్థులను ఆగస్టు 17న హైదరాబాద్‌లో రాష్ట్ర మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫివుల్లా, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, అకాడమిక్ హెడ్ ఎంఏ.లతీఫ్, ఒకేషనల్ స్టేట్ హెడ్ ఎండీ సుభాన్ అభినందించి సన్మానం చేశారు. గురుకులాల విద్యార్థులు విదేశీ చదువులకు ఎంపికకావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గురుకులాల మహబూబ్‌నగర్ రీజినల్ కోఆర్డినేటర్ ఖాజా బావుద్దీన్, విజిలెన్స్ అధికారులు జమీర్ ఖాన్, మహమూద్ ఆలం ఖాన్, అకాడమిక్ కోఆర్డినేటర్ సలీం తదితరులు పాల్గొన్నారు.