అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య విభాగం పరిధిలో 34 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 2,930 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెంగళ్‌రావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో పరిశీలించనున్నట్లు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
చదవండి:
Published date : 04 Feb 2023 02:41PM