Skip to main content

TS Gurukulam Jobs Exam Date and Timing Changes 2023 : తెలంగాణ గురుకులం ప‌రీక్ష‌ల్లో మార్పులు.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

సాక్షి ఎడ్య‌కేష‌న్‌ : తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు 9,210 పోస్టులకు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల్లో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది.
telangana gurukulam jobs exam dates and timings 2023
telangana gurukulam jobs exam 2023

మొద‌ట‌ ఆగస్టు 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు  బోర్డు తెలిపింది. తాజాగా గురుకుల నియామక బోర్డు ఆగస్టు 23 వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని వెల్లడించింది. అలాగే ఈ పరీక్షలకు సంబంధించిన‌ సవరణ షెడ్యూలును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే అభ్యర్థులు పరీక్ష తేదీలను మరోసారి చూసుకోవాలి.

➤☛ Eklavya Model Residential Schools Jobs 2023 : భారీ నోటిఫికేష‌న్‌.. ఏకలవ్య పాఠశాలల్లో 38480 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు..
గురుకులం ఉద్యోగాలు కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని గురుకుల నియామక బోర్డు వర్గాలు వెల్లడించాయి.

☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం త‌థ్యం..

జూలై 24 నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు..

ts gurukulam jobs exam news in telugu

గురుకులం పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు జూలై 24వ తేదీన‌ నుంచి (https://treirb.telangana.gov.in/) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు.

☛ TS Gurukulam Jobs 2023 Best Tips : 9231 గురుకులం ఉద్యోగాలు.. ఈ అంశాల‌పై ఫోక‌స్ పెట్టితే.. విజ‌యం మీదే..!

Published date : 21 Jul 2023 05:38PM

Photo Stories