TS Gurukulam Jobs 2023 Best Tips : 9231 గురుకులం ఉద్యోగాలు.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టితే.. విజయం మీదే..!
ఈ నేపథ్యంలో ఈ గురుకులం ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి బుక్స్ చదవాలి..? ఎలా ప్రిపేర్ అవ్వాలి..? సిలబస్‌లోని ముఖ్యమైన అంశాలు ఏమిటి? మొదలైనవి మీకోసం ప్రత్యేకంగా..
విజయం సాధించే మార్గాలు ఇవే..
ముఖ్యంగా సిలబస్‌ను..
తెలంగాణ గురుకుల పోస్ట్‌లకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్ క్రమంలో ముందుగా.. సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. సదరు టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. సిలబస్‌పై అవగాహన పొందిన అభ్యర్థులు.. వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి. అదే విధంగా పరీక్షల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
☛ TS Gurukulam Jobs 2023 Vacancy and Eligibility : టీఎస్ గురుకులం సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..
అన్ని పోస్టులకు.. జనరల్ స్టడీస్‌ను..
అన్ని పోస్టులకు సంబంధించి పేపర్-1లో రాణించాలంటే.. జనరల్ స్టడీస్‌కు సంబంధించి భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, సామాజిక వివక్ష; వికలాంగులు, గిరిజనులకు సంబంధించిన హక్కులు; సమ్మిళిత విధానాలు; సమాజ సంస్కృతి, నాగరికత, వారసత్వం; భారత్, తెలంగాణ కళలు, సాహిత్యం; సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా పరిణామాలు; పర్యావరణ సమస్యలు-విపత్తుల నిర్వహణ, నివారణ, ఉపశమన విధానాలు; భారత్, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి; తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రాధాన్యంగా తెలంగాణలోని సామాజిక-ఆర్థిక చరిత్ర, రాజకీయ-సాంస్కృతిక చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
అనలిటికల్ ఎబిలిటీస్ :
లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లపై దృష్టిపెట్టాలి.
ఇంగ్లిష్ :
ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీ, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, డైరెక్ట్-ఇన్ డైరెక్ట్ స్పీచ్, సెంటెన్స్ కరెక్షన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, యాంటానిమ్స్, సినానిమ్స్ వంటి బేసిక్ ఇంగ్లిష్ అంశాలపై పట్టు సాధించాలి.
పాత ప్రశ్న పత్రాలు ఎంతో ఉపయోగం..
అభ్యర్థులు టీచర్ నియామకాలకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటంది. గతంలో నిర్వహించిన డీఎస్‌సీ, టెట్ వంటి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. వాటిని ప్రాక్టీస్ చేయాలి. పెడగాజీ విషయంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది.
ఈ పుస్తకాలను చదివితే..
ఆయా పోస్ట్‌లకు సంబంధించి పేర్కొన్న సబ్జెక్ట్ పేపర్లలో రాణించేందుకు అభ్యర్థులు.. పీజీ స్థాయి అకడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆయా అంశాలను వర్తమాన పరిణామాలతో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
పెడగాజీని ప్రత్యేక దృష్టితో..
జూనియర్ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ పోస్ట్‌ల రాత పరీక్షలో ఒక పేపర్‌గా ఉండే పెడగాజీని అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ఇందుకోసం పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అదే విధంగా బోధన పద్ధతులు, మూల్యాంకన, ఇన్‌క్లూజివ్ ఎడ్యకేషన్, శిశు విద్యా ప్రణాళిక, ఆర్‌టీఈపై అవగాహన పెంచుకోవాలి.
☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం తథ్యం..