Good News: ఈ విద్యార్థులకు ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు.. మంత్రివర్గం ఆమోదం..
ఈ నేపథ్యంలో ఇక్కడ చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (ఏసీఎఫ్) పోస్టుల్లో 25 శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ), ఫారెస్టర్స్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ రూల్స్–1997, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–2000కు సవరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను అందించగా, వచ్చే కేబినెట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు పూర్తిస్థాయి ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
చదవండి:
IFS: పరీక్ష స్వరూపం, విజయానికి నిపుణుల సలహాలు...
Tribal School: అడవిలో అక్క బడి...పిల్లలు మెచ్చిన ఒడి
ఏ అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల ప్రాంతాన్నిఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు?