ఏ అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల ప్రాంతాన్నిఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు?
![](/sites/default/files/images/2021/08/18/caphotos-tiger-eco-sensitive-zone.jpg)
పులుల అభయారణ్యం చుట్టూ విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్, మిగిలిన అటవీ ప్రాంతాన్ని 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది. సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దానిచుట్టూ ఉన్న 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించాలని గతంలో ప్రతిపాదనలు పంపారు. అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 0 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల దూరం వరకు ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ జోన్ వల్ల పులులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం కూడా పెరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల అటవీ ప్రాంతాన్నిపర్యావరణ సున్నిత ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :కేంద్ర అటవీ శాఖ
ఎక్కడ :కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు
ఎందుకు :పులులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందని...