Skip to main content

Good News: ఈ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఒకేసారి 1,896 ఉద్యోగాలు

సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ న‌వంబ‌ర్‌ 20న‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది.
Notification on November 20, 1,896 openings for Village Animal Husbandry Assistants in Amaravati, Notification for filling up the posts in Animal Husbandry Department, 1,896 Village Animal Husbandry Assistant posts in Amaravati,

న‌వంబ‌ర్‌ 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్‌ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు.

డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

చదవండి: SSC CPO Preparation Tips: 1,876 ఎస్‌ఐ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

వేతనం రూ.22,460

ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్‌ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్‌ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు  ahd.aptonline.in, https://apaha-recruitment.aptonline.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తులు కూడా ఇదే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్‌ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్‌ 11వ తేదీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ

సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్‌ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు

జిల్లా

పోస్టుల సంఖ్య

అనంతపురం

473

చిత్తూరు

100

కర్నూలు

252

వైఎస్సార్‌

210

నెల్లూరు

143

ప్రకాశం

177

గుంటూరు

229

కృష్ణా

120

పశ్చిమ గోదావరి

102

తూర్పు గోదావరి

15

విశాఖపట్నం

28

విజయనగరం

13

శ్రీకాకుళం

34

Published date : 20 Nov 2023 12:38PM

Photo Stories