Skip to main content

Medical Health Department: 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మే 8 రాత్రి విడుద ల చేసింది.
List of 1442 Assistant Professors released
1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జాబితా విడుదల

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని 34 స్పెషాలిటీ విభాగాల్లో వీరు ఎంపికయ్యారు. కొత్తగా ప్రారంభమైన మెడికల్‌ కాలేజీ ల్లో మెరిట్‌ ఆధారంగా కౌన్సిలింగ్‌ నిర్వహించి అభ్యర్థులు కోరుకున్నచోట నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. భర్తీ ప్రక్రియను కేవలం 5 నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తి చేసిన బోర్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఎంపికైన వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్‌ స్పెషాలిటీ సేవలు మా రుమూల ప్రాంతాలకూ చేరువయ్యాయన్నారు. 

చదవండి: 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌లు: ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ ఇలా!

5204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీ మొదలు 

ఒకవైపు వైద్యుల భర్తీతో పాటు, మరోవైపు 5204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీని మొదలు పెట్టినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా స్టాఫ్‌నర్సు నియామక ప్రక్రి య పూర్తికి ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఎంపికైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంతో కొత్తగా ఏర్పడ్డ మెడికల్‌ కాలేజీల్లో, ఆయా విభాగాల్లో అందించే వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయని అన్నారు. రెండు వారాల్లోగా కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి, నియామక ఉత్వర్వులు అందించి, విధుల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను మంత్రి హరీశ్‌ ఆదేశించారు.  

India Post Recruitment 2023 : తపాలా శాఖలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు

Published date : 09 May 2023 03:50PM

Photo Stories