Skip to main content

9000 Above Anganwadi Jobs 2024 : గుడ్‌న్యూస్‌..9000ల‌కు పైగా అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌..అర్హ‌త‌లు ఇవే..ఈనెలలోనే చివ‌రిల్లోనే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని మ‌హిళ‌కు శుభ‌వార్త‌. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచ‌ర్‌, సహాయకుల ఉద్యోగాల‌ను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
Telangana Anganwadi Teacher Recruitment 2024 9000 above anganwadi jobs. Telengana anganwadi job notification good news for anganwadis

అన్నీ కుదిరితే ఈ ఆగ‌స్టు నెల చివ‌రిల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 9000పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి.

ఈ పోస్టుల‌కు అర్హతలు ఇవే.. :

telagana anganwadi jobs 2024 news telugu

అంగన్‌వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాల‌కు నియమితులయ్యేవారు కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణతై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. 

వ‌యోప‌రిమ‌తి : 
ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ‌తంలో తెలిపారు.

Published date : 08 Aug 2024 06:15PM

Photo Stories