Paramedical courses Admissions: పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి : పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30న ఎస్వీ వైద్య కళాశాల సమావేశ మందిరంలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అర్హత గల అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తీసుకురావాలని తెలియజేశారు.
SSC JE Paper I Results Declared: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్-1 ఫలితాలు విడుదల
కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ) కోర్సులో 30సీట్లు, డిప్లొమో ఇన్ అనస్తీషియా(డీఏఎన్‌ఎస్) కోర్సులో 30సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సీట్లు సాధించిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు రూ. 6వేలు, అడ్మిషన్ ఫీజు రూ.500, కాషన్ డిపాజిట్(రీఫండబుల్) రూ.1000, బోర్డు ఫీజు రూ.200 అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.