Skip to main content

KGBV Jobs: కేజీబీవీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు

నిర్మల్‌ చైన్‌గేట్‌: జిల్లాలోని వివిధ కేజీబీవీలలో 32 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు.
Non Teaching Posts in KGBV

ఆయా మండలాల పరిధిలోని కేజీబీవీలలో వంట మనిషి, సహాయ వంట మనిషి, స్వీపర్‌, స్కావెంజర్‌, ఆఫీస్‌ సుబార్డినెట్‌, డే, నైట్‌ వాచ్‌ వుమెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

చదవండి: Thotapalli Jyothi: పట్టుదలతో చదివి.. రెండు ప్రభుత్వ కొలువులు పట్టి

దరఖాస్తు చేసుకునేవారు ఆయా మండలాలకు చెందివారై ఉండాలని, పదో తరగతి పాస్‌ కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆగ‌స్టు 31లోపు సొంత మండలంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ఖాళీల వివరాలు ఆయా మండలాల విద్యాశాఖ కార్యాలయం నోటీస్‌ బోర్డ్‌పై ఉంచినట్లు తెలిపారు.

Published date : 22 Aug 2024 03:23PM

Photo Stories