Job opportunities 2023 : టెన్త్ పాస్.. ఇంటర్, డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు.. మహిళలకు కూడా..
ఈ మేరకు ఆ కేంద్రం మేనేజర్ బి.శ్రీకాంత్ జూలై 13వ తేదీన (బుధవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ సేల్స్ అసోసియేట్ అంశాలపై 55 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది. వీటితో పాటు కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ టిప్స్‌పై శిక్షణ ఇస్తారు. పదో తరగతి పాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఫెయిల్ అయి, 18 నుంచి 32 సంవత్సరాల్లోపు ఉన్న వారు అర్హులు. పూర్తి వివరాలకు అనంతపురం శివారులోని చిన్మయనగర్‌లో ఉన్న కౌశల్ కేంద్రాన్ని (70321 34767, 81257 46282) సంప్రదించవచ్చు.
మహిళలకు కూడా..
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలకు రూడ్‌సెట్ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్, కంప్యూటర్ ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి జూలై 13వ తేదీన (బుధవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 2 నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. కంప్యూటర్ ట్యాలీ శిక్షణకు ఇంటర్మీడియట్‌లో సీఈసీ, బీకాం పూర్తి చేసిన వారు, బ్యూటీపార్లర్ శిక్షణకు పదో తరగతి ఫెయిల్ లేదా పాస్ అయిన వారు అర్హులు. పూర్తి వివరాలకు 94409 05479, 96188 76060, 08554–255925లో సంప్రదించవచ్చు.