Skip to main content

Jobs: కారుణ్య నియామక ఉత్తర్వుల అందజేత

విజయనగరం రూరల్‌: జిల్లా పరిషత్‌ పరిధిలో విధులు నిర్వహిస్తూ పదోన్నతులు పొందిన ఉద్యోగులు, కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం పొందిన వారికి జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు జ‌నవ‌రి 26న‌ ఉత్తర్వులు అందజేశారు.
Zilla Parishad employees getting promoted and appointed on January 26   Employees receiving promotion orders from ZP Chairman on January 26   Issuer of compassionate appointment orders    ZP Chairman Mazji Srinivasa Rao handing over promotion orders in Vizianagaram Rural

కారుణ్య నియామకంలో బి.రమ్యశ్రీకి ఎల్‌.కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, బొత్స హరితకు చింతాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్‌ సహాయకులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. అలాగే పదోన్నతులు పొందిన ఎల్‌.ముఖేశ్వరరావును సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో, డి.దుర్గాప్రసాద్‌ను పార్వతీపురం పీఐయూ డివిజన్‌లో టైపిస్టులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.

చదవండి: Interview for Jobs: కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూ

రాజాన భారతిని ఉద్దవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల కార్యాలయం సహాయకురాలిగా నియామకపత్రం అందజేశారు. ఆఫీస్‌ సబార్డినేట్లుగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌కుమార్‌ను పూసపాటిరేగ ఎంపీడీవో కార్యాలయంలో, బి.అఖిల్‌కుమార్‌ను పార్వతీపురం పీఆర్‌ఐ డివిజన్‌లో టైపిస్టులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.రాజ్‌కుమార్‌, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Published date : 27 Jan 2024 01:20PM

Photo Stories