Medical Jobs: వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ వైద్యకళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ ఇందిర జనవరి 26న ఓ ప్రకటనలో తెలిపారు.
జనవరి 29 నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని వైద్యకళాశాల కార్యాలయంలో దరఖాస్తు లు అందించాలన్నారు. ప్రొఫెసర్–06, అసిస్టెంట్ ప్రొఫెసర్–04, ట్యూటర్–10, సివిల్ అసిస్టెంట్ సర్జన్–16, జూనియర్ రెసిడెంట్–18 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వచ్చేనెల 6న ఉదయం 11 గంటలకు మెడికల్ కళాశాల కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. పోస్టులకు సంబంధించి 7వ తేదీన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) చాంబర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
Published date : 29 Jan 2024 08:42AM