Skip to main content

Job Mela: యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు

ఆత్మకూరు రూరల్‌: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ ద్వారా జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు.
huge job opportunity for the youth, Attendees exploring job opportunities at the event initiated by the late minister Mekapati Gautham Reddy.

మేకపాటి గౌతమ్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆంధ్రా ఇంజినీరింగ్‌ కళాశాలలో న‌వంబ‌ర్ 2న‌ నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే రెండుసార్లు జాబ్‌మేళాలను నిర్వహించి వందలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించామని గుర్తుచేశారు. ఇక నుంచి ఏటా నవంబర్‌ రెండున జాబ్‌ మేళాను నిర్వహించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు.

చదవండి: TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ తదితర రంగాలకు చెందిన 30 సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఆర్డీఓ మధులత, ఎంపీపీ కేతా వేణగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇందూరు వెంకటరమణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గంగవరపు శ్రీనివాసులునాయుడు, సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి, కాటంరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Published date : 03 Nov 2023 01:29PM

Photo Stories