Good News For Government Employees : కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఇకపై జీతాలు ఈలోపే..!
అయితే.. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం అలాంటి అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా.. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి 5లోపే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఇప్పటికే రేవంత్ సర్కార్...
ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపయినా సరే.. ప్రతి నెల 5వ తారీఖులోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని భావిస్తోన్న ప్రభుత్వం. జీతం సరైన సమయానికి ఇచ్చి వారిని సంతోషపరిచేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే.. అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సర్కార్.. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెడుతోంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను..
అధికారులు అప్రమత్తంగా పని చేయాలని.. విధుల్లో నిర్లక్ష్యం పనికి రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సరైన సమయంలో జీతాలు ఇస్తే.. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా సేవలందించనున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. జనవరి 5లోపే జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కేవలం జనవరి నెలకే పరిమితం కాకుండా.. ఇలా ప్రతి నెలా 5 లోపే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెల్సిందే.
Tags
- telangana cm revanth reddy
- Good News For Government Employees Salary News in Telugu
- Good News For Government Employees Salary payments
- good news for govt employees
- government employees salary payment date
- ts government employees salary payment date
- government employees salary payment date news telugu
- Good News
- Revanth Reddy Latest News in Telugu
- sakshi education videos
- SalaryPayment
- PreviousGovernment
- Announcement
- NewYearNews