అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2022న పరీక్ష రాసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని మెడికల్, హెల్త్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఫిబ్రవరి 2న ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చేటప్పుడు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జత జిరాక్సు ప్రతులు తీసుకురావాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు https://mhsrb.telangana.gov.in చూడాలని సూచించారు.
చదవండి:
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ అర్హత ఉండాల్సిందే..
త్వరలో బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న265 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!
Published date : 03 Feb 2023 01:55PM