Fake Job Notification: ఆ ఉద్యోగ ప్రకటన నమ్మి మోసపోవద్దు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మరక్షణ శిక్షణ (సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్) ఇచ్చేందుకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఉద్యోగాల పేరిట కొందరు మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
‘యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్’ పేరిట ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న లేఖ మోసపూరితమని పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష తరఫున పాఠశాలల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదని, నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేయడానికే కొందరు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
చదవండి: 267 Jobs: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గాని, వారి ప్రకటనతో గాని సమగ్ర శిక్ష కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
Published date : 11 Jan 2024 10:18AM