Jobs: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. ఖాళీల వివరాలు ఇవీ..
Sakshi Education
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు ఐఐటీ/నీట్ అకాడమీల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి మే 26న ఒక ప్రకటనలో తెలిపారు.
అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. ఖాళీల వివరాలు ఇవీ..
కృష్ణాజిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, విశాఖపట్నం జిల్లా మధురవాడ అకాడమీల్లో వివిధ సబ్జెక్టుల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు జూన్ 6వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.