Skip to main content

Jobs: లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

చేవెళ్ల: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కాంచన లత డిసెంబ‌ర్ 18న‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Chevella College Job Alert  Telugu Lecturer Position  Applications are invited for the post of Telugu Lecturer   Telugu Lecturer Position at Chevella Government Degree College

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కమిషనర్‌ కళాశాల విద్యాశాఖ నుంచి తెలుగు అధ్యాపకుల నియామకానికి అనుమతి ఉత్తర్వులు వెలువడినట్లు చెప్పారు. అభ్యర్థులు తెలుగు సబ్జెక్టులో పీజీలో 55శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు.

చదవండి: AP Govt Jobs: కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి (సీఎంఓ) పోస్టుకు దరఖాస్తులు... ఎవరు అర్హులంటే..

అలాగే ఎన్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఈటీ, సెట్‌, పీహెచ్‌డీ, బోధనలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబ‌ర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 03:47PM

Photo Stories