Skip to main content

AP Govt Jobs: కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి (సీఎంఓ) పోస్టుకు దరఖాస్తులు... ఎవరు అర్హులంటే..

Community Mobilization Officer (CMO) Vacancy  Invitation of applications for the post of CMO  Eluru District Education Department

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా కార్యాలయంలో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి (సీఎంఓ) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త, ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్‌సుందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ హైస్కూళ్లలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, డైట్‌ లెక్చరర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు అర్హులని పేర్కొన్నారు. అర్హత గలవారు ఈనెల 15న సాయంత్రం 5 గంటలలోపు అదనపు పథక సమన్వయకర్త, సమగ్రశిక్ష, ఏలూరు కార్యాలయానికి చేరేలా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9959021342లో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: APPSC Group 1 Notification: నిరుద్యోగులకు మరో శుభవార్త

Published date : 11 Dec 2023 12:03PM

Photo Stories