AP Government Jobs Notifications 2024 : నిరుద్యోగులకు ఏపీ సీఎం సంక్రాంతి కానుక ఇదే.. త్వరలోనే భారీగా ..
![APPSC Announces Teacher Jobs as Sankranthi Gift Teacher Vacancies in Andhra Pradesh Teacher Opportunities in Andhra Pradesh ap government jobs notifications 2024 details in telugu APPSC Group 1 & 2 Jobs Notification](/sites/default/files/images/2024/01/17/ys-jagan-distribution-1705464727.jpg)
పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలిచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలుచేశారని ఆయన గుర్తుచేశారు.
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఏపీ అభివృద్ధి బాటపడితే.. ఇప్పుడాయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం ఏపీలో జరిగిందన్నారు.
వీటి ఆధారంగానే ప్రభుత్వం నోటిఫికేషన్..
![botsa satyanarayana news telugu](/sites/default/files/inline-images/botsa-satyanarayana.jpg)
మరోవైపు.. అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్‌మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
Tags
- ap government jobs notifications 2024
- ap dsc 2024 notification
- AP Mega DSC Notification 2024
- AP CM YS Jagan Mohan Reddy
- AP Mega DSC 2024 News Telugu
- ap government jobs 2024
- ap government teacher jobs 2024
- ap government teacher jobs 2024 notification
- government teacher posts in andhra pradesh
- govt teacher jobs in ap 2024 notification
- ap teacher jobs 2024
- government teacher jobs 2024
- ap dsc syllabus
- botsa satyanarayana dsc notification news telugu
- botsa satyanarayana dsc news telugu
- ap government teacher jobs vacancies details 2024
- ap government teacher jobs vacancies details 2024 telugu news
- ap government teacher jobs vacancies district wise
- sakshi education latest job notifications
- latest jobs in 2024