AP Anganwadi Workers Alerts : అంగన్‌వాడీలు విధులకు హాజరుకావాలి.. ప్రభుత్వం కొన్ని కోర్కెలను..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె విరమించాలని, జనవరి 5 లోగా విధులకు హాజరు కావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి కొన్ని కోర్కెలు అంగీకరించిన విషయాన్ని గ్రహించాలన్నారు.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. విధులకు హాజరు కాకపోవడంతో పోషకాహార కిట్లు, గుడ్లు, పాలు, సప్లిమెంటరీ న్యూట్రిషన్ లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సేవలు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణులు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులను పడుతున్నారన్నారు.
Published date : 20 Jan 2024 12:27PM