Telangana Breaking News : 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..
కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి సర్కార్ అనుమతి ఇవ్వగా.. అందులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు ఉన్నాయి. పీజీటీ 235, టీజీటీ 324, ప్రిన్సిపాల్ 10 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేయనుంది. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో వరుస ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో. నిరుద్యోగుల్ని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ,గ్రూప్ 4, పోలీస్, మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతేడాది 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..