Skip to main content

201 Jobs: వైద్య కళాశాలల్లో ట్యూటర్‌ పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 వైద్య కళాశాలల్లో నాన్‌ మెడికల్‌ విభాగంలో 201 ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
201 Jobs
వైద్య కళాశాలల్లో ట్యూటర్‌ పోస్టులు

ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జనవరి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెస్సీ సంబంధిత విభాగంలో ఉత్తీర్ణతతోపాటు 45 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నెలవారీ వీరికి జీతం రూ. 57,700గా నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ట్యూటర్‌లను భర్తీ చేయాలని వైద్య కళాశాలల సంబంధిత ప్రిన్సిపాల్‌లను ఆదేశించింది.

చదవండి: Education news: ప్రభుత్వ బీటెక్‌ కాలేజీలలో 3,500 సీట్లేనా.. మెడికల్‌ కాలేజీలు ఎన్నో తెలుసా.?

నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 16, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 10, సిద్దిపేటలో 8, నల్లగొండలో 18, సూర్యాపేటలో 18, సంగారెడ్డిలో 13, నాగర్‌ కర్నూలులో 14, వనపర్తిలో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 15, జగిత్యాలలో 14, మంచిర్యాలలో 13, మహబూబాబాద్‌లో 14, రామగుండం వైద్యకళాశాలలో 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

చదవండి: Solar Energy: సౌరశక్తితో యవ్వనం.. శాస్త్రవేత్తల ప్రయోగం

Published date : 19 Jan 2023 01:02PM

Photo Stories