Skip to main content

Education news: ప్రభుత్వ బీటెక్‌ కాలేజీలలో 3,500 సీట్లేనా.. మెడికల్‌ కాలేజీలు ఎన్నో తెలుసా.?

తెలంగాణ ఏర్పడ్డాక విద్యా, వైద్యం పరంగా పురోగతి గణనీయంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఇక్కడ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు తక్కువగా ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు.

అలాగే జిల్లాలో సర్వజన వైద్య శాలలు తక్కువగా ఉండడంతో రోగులు హైదరాబాద్‌కు రావాల్సిన దుస్థితి ఉండేది. ఈ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్‌ భారీగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు పూనుకుని ఆచరణలోకి దిగింది. దీంతో భారీగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రావడంతో భారీగా మెడికల్‌ సీట్లు వచ్చాయి.   
33కు పెరిగిన మెడికల్‌ కాలేజీలు..
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం అయిదు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 17కు పెరిగింది. వచ్చే రెండేళ్లలో మరో 16 అందుబాటులోకి వస్తాయని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. మెడికల్‌ కళాశాలల్లో లక్ష్యం మేరకు పురోగతి సాధించడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. వీటితో పాటు మహిళా, ఉద్యాన వర్సిటీలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మూడేళ్లలో 10 ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతినిచ్చింది.
కేవలం 3,500 సీట్లు మాత్రమే..
రాష్ట్రంలో ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో హైదరాబాద్, సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథని, సిరిసిల్ల, వనపర్తిలో ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఓయూ ప్రాంగణంలో ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు టెక్నాలజీ కళాశాల నడుస్తోంది. కాకతీయ వర్సిటీ కింద వరంగల్, కొత్తగూడెంలో కళాశాలలున్నాయి. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని కళాశాలను కలుపుకొంటే మొత్తం 11 మాత్రమే ఉన్నాయి. వీటిలో మొత్తం సీట్లు కేవలం 3,500 మాత్రమే ఉంటే... రాష్ట్రంలో ఉన్న సీట్లు 1.10 లక్షలు. దీంతో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 11 పాలిటెక్నిక్‌  కాలేజీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మొత్తానికి సర్కార్‌ లక్ష్యం పూర్తయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాలేజీలలో సీట్లు 6వేలకు పెరిగే అవకాశం ఉంది.

Published date : 16 Jan 2023 06:10PM

Photo Stories