Skip to main content

Irrigation Department: ఏఈఈల జీతాల నిలిపివేత

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో 500 మందికి పైగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ఇటీవల నిర్వహించిన బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో.. వచ్చే నెలలో వారికి జీతాలు నిలిపివేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆదేశించింది.
Withholding of salaries of AEEs

కాగా, జీవో నంబర్‌ 193 ఆధారంగానే తమకు బదిలీలు నిర్వహించారని, జీతాలు నిలిపివేత సరికాదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సైతం ఇదే తరహాలో వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం డైరెక్టర్‌ తమ జీతాలను నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. జీతాలు నిలిపివేస్తే వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

చదవండి: 1,578 Jobs: నీటిపారుదల శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీ

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Oct 2024 01:39PM

Photo Stories