Nethi Muralidhar: వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం
ఈ మేరకు టెస్కాబ్ ఎం.డి డాక్టర్ నేతి మురళీధర్ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని సంబంధిత సరి్టఫికెట్ సమరి్పంచాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి:
APCPDCL: నూతన డైరెక్టర్‌గా జయభారతరావు
Exams: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు!
NARCL: బ్యాడ్ బ్యాంక్‌కు ఏ చట్టం కింద ఆర్‌బీఐ లైసెన్స్‌ను మంజూరు చేసింది?