NARCL: బ్యాడ్ బ్యాంక్‌కు ఏ చట్టం కింద ఆర్‌బీఐ లైసెన్స్‌ను మంజూరు చేసింది?
బ్యాంకుల మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఏర్పాటు చేస్తున్న బ్యాడ్ బ్యాంక్ లేదా జాతీయ రుణ పునర్‌వ్యవస్థీకరణ సంస్థ (నేషనల్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ – ఎన్‌ఏఆర్‌సీఎల్)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లైసెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఐబీఏ సీఈఓ సునిల్ మెహతా అక్టోబర్ 4న ట్విట్టర్ ద్వారా తెలిపారు. సర్ఫేసీ చట్టం 2002, సెక్షన్ 3 కింద ఈ లైసెన్స్ మంజూరయినట్లు పేర్కొన్నారు. ఎన్‌ఏఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పీఎం నయ్యర్ నియమితులైన విషయం విదితమే. కంపెనీ బోర్డ్‌లో ఉన్న ఇతర డైరెక్టర్లలో ఐబీఏ సీఈఓ మెహతా, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ నాయర్, కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అజిత్ కృష్ణన్ నాయర్ ఉన్నారు.
అదానీ గ్రీన్ చేతికి ఎస్‌బీ ఎనర్జీ
ఐదు నెలల క్రితం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్‌బీ ఎనర్జీ ఇండియా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్) తాజాగా వెల్లడించింది. ఇందుకు 3.5 బిలియన్ డాలర్లు(రూ. 26,000 కోట్లు) వెచ్చించినట్లు తెలియజేసింది. దీంతో ఎస్‌బీ ఎనర్జీలో 100 శాతం వాటాను ఏజీఈఎల్ సొంతం చేసుకుంది.
నాడ్‌విన్‌తో పీవీఆర్ జట్టు
గేమ్స్‌కి సంబంధించి లైవ్ టోర్నమెంట్‌లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్ కంపెనీ నాడ్‌విన్ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్ పీవీఆర్ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ కమల్ జ్ఞాన్‌చందాని తెలిపారు.
చదవండి: బ్యాడ్ బ్యాంక్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఎంత శాతంగా ఉండనుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాడ్ బ్యాంక్ లేదా జాతీయ రుణ పునర్‌వ్యవస్థీకరణ సంస్థ (నేషనల్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ – ఎన్‌ఏఆర్‌సీఎల్)కు లైసెన్స్ జారీ
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : బ్యాంకుల మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం కోసం...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్