Skip to main content

Governor: నియామకాల్లో పారదర్శకత అవసరం

విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టే పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని.. అర్హత ఆధారంగానే నియామకాలు ఉండాలని తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో ఉన్నతాధికారులు లింబాద్రి, వాకాటి కరుణ, నవీన్‌మిట్టల్‌

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల నేపథ్యంలోనే తాను ఉమ్మడి బోర్డు ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్, మంత్రి భేటీ అనంతరం రాజ్‌భవన్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సమావేశం సందర్భంగా గవర్నర్‌ పలు సూచనలు చేసినట్టు తెలిపింది.

చదవండి: IHM Recruitment 2022: ఐహెచ్‌ఎం, ముంబైలో 21 పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించడం, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనలను పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడినట్టు వివరించింది. యూనివర్సిటీల్లో లైబ్రరీలు, డిజిటల్‌ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రభుత్వ హాస్టళ్లను మెరుగుపర్చడంతోపాటు విద్యాసంస్థల్లో ల్యాబ్‌లు పెంచాలని అధికారులకు సూచించినట్టు తెలిపింది. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ పేర్కొన్నట్టు వివరించింది. 

చదవండి: IIIT Sri City Recruitment 2022: ట్రిపుల్‌ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో లెక్చరర్‌ పోస్టులు.. నెలకు రూ.70,000 వ‌ర‌కు వేతనం..

Published date : 11 Nov 2022 01:42PM

Photo Stories