Books: పుస్తకాలతో దోస్తీ.. – careof అఫ్జల్‌గంజ్
- దాదాపు 30వేల ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్
- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత
ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ల వార్త వినిపించగానే ఎక్కడా లేని సంతోషం
కలిగింది. ఎలాగైనా పోటీని తట్టుకొని ఉద్యోగం సాధించాలనే సంకల్పం పెరిగింది. కొలువులకై కుస్తీ పడాలంటే పుస్తకాలతో దోస్తీ చేయాల్సిందే.. గంటల తరబడి చదివితే తప్ప పోటీని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్లలో ఏకాగ్రతకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున చాలామంది లైబ్రరీల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో చెట్లకిందే
చదువుకుంటున్నారు.
Also read: TSEDCET: ఏప్రిల్ 7 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ
– అఫ్జల్‌గంజ్
ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు పెద్దఎత్తున గ్రంథాలయాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 30,453 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు లైబ్రరీల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. దాదాపు 130 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అసఫీయ లైబ్రరీగా పేరొందిన అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో సుమారు 6 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులు గ్రంథాలయానికి చేరుకొని తమకు కావాల్సిన పుస్తకాలను తీసుకొని ప్రశాంత వాతావరణంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
Also read: Government Jobs: 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఉచిత కోచింగ్.. అర్హతలు ఇవే..
అద్దె గదుల్లో ఉంటూ..
దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలోనే రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి సైతం ఇక్కడకు వచ్చి అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. పాఠకులకు కావాల్సిన నీరు, మూత్రశాలలు
తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also read: Group 1 & 2 : సిలబస్ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్ కుమార్ గ్రూప్–1 విజేత
బుక్స్ ఆన్ డిమాండ్..
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయంలో పెద్ద ఎత్తున వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. లేని పుస్తకాలు ఎవరైనా కోరితే బుక్స్ ఆన్ డిమాండ్ కింద మూడు రోజుల్లో తెప్పించి ఇస్తున్నామని గ్రంథాలయ అధికారులు తెలిపారు.
Also read: TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్.. అర్హతలు ఇవే..
అసరాగా అన్నపూర్ణ భోజనం..
గ్రంథాలయం చేరువలోనే అన్నపూర్ణ భోజన కేంద్రంలో రూ.5కే భోజనం అందుబాటులో ఉండటంతో అక్కడే తిని, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు పలువురు నిరుద్యోగులు తెలిపారు.