Skip to main content

Government Jobs: 80 వేలకు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు.. ఉచిత కోచింగ్‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది.
బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం
బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం

దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది.  బీసీ స్టడీ సెంటర్ల ద్వారా  బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది.

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

 ఈ ఆధారంగానే ఎంపిక‌..
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్‌ పేరుతో  100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు  చేశామని  మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు.  ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్‌సీ, క్లరికల్‌ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను  స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

Groups: గ్రూప్‌–1&2లో ఉద్యోగం సాధించ‌డం ఎలా ?

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

ఏప్రిల్ 19 న స్క్రీనింగ్ టెస్ట్‌.. వివ‌రాలు ఇవే.. 
అలాగే కోచింగ్‌కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 19న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు.  ఫలితాలను వెంటనే అన్‌లైన్‌లో ప్రకటిస్తామని చెప్పారు.  ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి​​​​​​​

ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌ ద్వారా శిక్షణ..
డిజిటల్‌ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటుందన్నారు.  ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా  ట్రైనింగ్‌ ఉంటుందన్నారు.  ముఖ్యంగా దీనికి సంబంధించి అన్‌అకాడమీ, బైజూస్‌ లాంటి సంస్థలతో టైఅప్‌ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు.

పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు..
ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్‌ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్‌నెస్‌ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్‌గా కూడా  ఆన్‌లైన్‌ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని  ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి 

Published date : 05 Apr 2022 04:57PM

Photo Stories