ఏ ఉద్యోగి జీతంలో తగ్గుదల ఉండదు.. ఐఆర్ జీతంలో కాదు..
పది రోజులు ఆగితే పే స్లిప్‌లు వస్తాయని, గత పేస్లిప్, ఇప్పటి పేస్లిప్‌ను పోల్చి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఉద్యోగులందరి జీతాలను లెక్కించామని, ఏ ఉద్యోగి గ్రాస్ జీతంలో తగ్గుదల ఉండదన్నారు. సగటున ప్రతి ఉద్యోగి జీతం 20 శాతం పెరుగుతుందని తెలిపారు. మధ్యంతర భృతి (ఐఆర్) తీసి వేసిన తర్వాత కూడా జీతాల్లో తగ్గుదల లేదని చెప్పారు. సచివాలయంలో జనవరి 19న ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి పీఆర్సీకి సంబంధించిన పలు అంశాలపై మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హెచ్‌ఆర్‌ఏ అంశం వేరని, కొత్త స్లాబు ప్రకారం హెచ్‌ఆర్‌ఏ 2 నుంచి 5 శాతం తగ్గినా గ్రాస్‌లో అది కనిపించదన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం ఆదాయం రూ.62 వేల కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. కరోనా లేకపోతే ఇది రూ.98 వేల కోట్లకు చేరుకునేదన్నారు. కరోనా ఉన్నప్పటికీ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కల్పించామని, పీఆర్సీ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే ఉద్యోగులకు వెసులుబాటు కలి్పంచేందుకు రూ.17 వేల కోట్ల ఐఆర్ ఇచ్చామని తెలిపారు. ఐఆర్ జీతంలో భాగం కాదనే విషయం ఉద్యోగులకు తెలుసునని, అది కేవలం సర్దుబాటు మాత్రమేనే విషయం ఐఆర్ జీఓలోనే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు.
రూ.10,247 కోట్ల అదనపు భారం
కొత్త పీఆర్సీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ చెప్పారు. ఐఏ ఎస్ అధికారుల హెచ్‌ఆర్‌ఏ రూ.40 వేలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు.
చదవండి:
Good News: హోంగార్డుల జీతం 30 శాతం పెంపు..రోజుకు ఎంతంటే..?
IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేతనం..