తెలంగాణలో వీరికి 30శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం: రిజ్వీ
ఈ మేరకు ప్రభుత్వం జనవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు ఇస్నోన్న ఇన్సెంటీవ్స్‌ని 30 శాతం పీఆర్‌సీతో పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశా వర్కర్లు తమ నెల వారీ జీతం 7,500 అందుకుంటుండగా పెంచిన ఇన్సెంటీవ్స్‌తో వారికి రూ. 9,750 జీతం అందనుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న ఆశా వర్కర్లందరికీ ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి:
UPSC: కీలక ప్రకటన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు..
EAPCET: స్పెషల్ కౌన్సెలింగ్.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ ఇదే..