UPSC: కీలక ప్రకటన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు..
దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపిఎస్ వంటి అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడుతాయన్న పుకార్లను తోసిపుచ్చింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జనవరి 7 నుంచి యథావిధిగా ఈ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు, ఆంక్షలను పాటించాలని పేర్కొంది. ఎగ్జామ్ సెంటర్లలో మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. విద్యార్థులు పరీక్షకు సకాలంలో కేంద్రాలను చేరుకునేందుక వీలుగా రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేయాలని సూచించింది.
చదవండి:
స్మార్ట్‌గా చదివా.. సివిల్స్ టాప్ ర్యాంక్ కొట్టా..ఇదే సూత్రాన్ని పాటించాను...