EAPCET: స్పెషల్ కౌన్సెలింగ్.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ ఇదే..
ఈ మేరకు కన్వీనర్ పోలా భాస్కర్ జనవరి 5న ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల సౌకర్యార్థం ఈ స్పెషల్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఏటా 3 లేదా 4 దఫాలుగా నిర్వహించి అర్హులైన విద్యార్థులందరికీ కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చేలా అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ సారి కరోనా, ఇతర కారణాల వల్ల ఈఏపీ సెట్, అడ్మిషన్లు ఆలస్యం కావడం, దీంతో కాలేజీల ప్రారంభం కూడా ఆలస్యమవుతుండటంతో కౌన్సెలింగ్‌ను రెండు దశల్లో ముగించారు. దీంతో తమకు సీట్లు కేటాయింపు కాలేదని, మరోసారి అవకాశం కలి్పంచాలని అనేక మంది విద్యార్థులు ప్రభుత్వానికి విన్నవిస్తూ వచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అడ్మిషన్ల కమిటీ చర్యలు చేపట్టింది.
షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్: జనవరి 5
ఆన్ లైన్ రిజి్రస్టేషన్, ఫీజు చెల్లింపు: జనవరి 7
సర్టిఫికెట్ల పరిశీలన (ఆన్ లైన్): జనవరి 7
హెల్ప్ లైన్ కేంద్రాల ద్వారా సరి్టఫికెట్ల పరిశీలన: జనవరి 7, 8
వెబ్ ఆప్షన్ల నమోదు: జనవరి 7, 8
సీట్ల కేటాయింపు: జనవరి 10
సెల్ఫ్ రిపోరి్టంగ్, కాలేజీల్లో రిపోరి్టంగ్: జనవరి 10 నుంచి 13 వరకు
చదవండి: